Logo
Download our app
అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు
NEWS   Feb 21,2025 09:25 pm
ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ములుగు డి.ఎస్.పి ఎన్  రవీందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా ఓవర్లోడును అరికట్టేందుకు ఏర్పాటుచేసిన చెక్పోస్టులో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కొన్ని ఇసుక లారీలను ఆపి తనిఖీ చేసి ఇసుక అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source