Logo
Download our app
గ్రూప్ -2 మెయిన్స్ అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయండి
NEWS   Feb 21,2025 05:52 pm
గ్రూప్ 2 మెయిన్స్ కి అర్హ‌త సాధించిన 92 వేల 250 మంది అభ్య‌ర్థులకు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. 2023 డిసెంబర్ 11న ఇచ్చిన నోటిఫికేషన్ లో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నార‌ని పేర్కొన్నారు. వీటిని స‌రిదిద్ద‌క పోతే తీవ్రంగా నష్ట పోయే అవ‌కాశం ఉంద‌న్నారు. న్యాయ ప‌ర‌మైన ఇబ్బందుల‌తో నోటిఫికేష‌న్ ర‌ద్ద‌య్యే ప‌రిస్థితులు ఉంటాయ‌న్నారు. దీనిపై మ‌రోసారి ప్ర‌భుత్వం ఆలోచించాల‌ని , న్యాయం చేయాల‌ని కోరారు వైఎస్ ష‌ర్మిల‌.
⚠️ You are not allowed to copy content or view source