డైరెక్టర్ శంకర్ ఆస్తులు జప్తు - ఈడీ
NEWS Feb 21,2025 02:14 pm
తమిళ సినీ దర్శకుడు శంకర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. రజనీకాంత్ నటించిన రోబో సినిమాకు సంబంధించి కాపీ రైట్ కు పాల్పడ్డాడని విచారణలో తేలిందని వెల్లడించింది. దీంతో శంకర్ కు చెందిన రూ. 10.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. రోబో మూవీ కథ తనకు చెందినదంటూ తమిళనాడుకు చెందిన తమిళనాథన్ కోర్టుకు ఎక్కాడు. విచారణలో సదరు పుస్తకంలోని కథ, రోబో కథ ఒకేలాగా ఉందని తేలి పోయింది. దీంతో ఆస్తులను జప్తు చేసింది ఈడీ.