సోనియాకు అస్వస్థత ఆస్పత్రిలో చేరిక
NEWS Feb 21,2025 07:32 am
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సోనియా వయసు 78 ఏళ్లు. ఆస్పత్రి నిర్వహణ బోర్డు చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ఆధ్వర్యంలో చికిత్సలు కొనసాగుతున్నాయి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా వెల్లడించారు. సోనియా గాంధీ ప్రస్తుతం గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమిరాన్ సంరక్షణలో ఉన్నారు.