Logo
Download our app
ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
NEWS   Feb 20,2025 05:18 pm
మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం కేసీఆర్ అని ఆరోపించారు. ఏపీ నాయకులతో కుమ్మ‌క్క‌య్యార‌ని, నీళ్ల‌ను దోచి పెట్టాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. 575 టీఎంసీల వాటా ఉంటే కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకాలు పెట్టొచ్చార‌ని మండిప‌డ్డారు. త‌న వ‌ద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పారు. దీనికి బీఆర్ఎస్ నేత‌లు స‌మాధానం చెబుతారా అంటూ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source