Logo
Download our app
టీటీడీ బోర్డు స‌భ్యుడిని తొలగించాలి
NEWS   Feb 20,2025 03:41 pm
టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడు న‌రేష్ కుమార్ ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ తిరుమ‌ల‌లో ఉద్యోగులు ఆందోళ‌న చేప‌ట్టారు. శ్రీ‌వారి మ‌హా ద్వారం అంద‌రూ చూస్తుండ‌గా అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. బేష‌ర‌తుగా సిబ్బందికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌ని లేదంటే త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source