Logo
Download our app
తుంగ‌భ‌ద్ర న‌దిలో డాక్ట‌ర్ మిస్సింగ్
NEWS   Feb 20,2025 02:05 pm
హైద‌రాబాద్ కు చెందిన డాక్ట‌ర్ అన‌న్య రావు కొప్ప‌ల్ జిల్లా గంగావ‌తి తాలూకా లోని స‌నాపూర్ గ్రామం స‌మీపంలో తుంగ‌భ‌ద్ర న‌దిలో దూకి అదృశ్య‌మ‌య్యారు. స్నేహితుల‌తో క‌లిసి వెళ్లారు. అగ్నిమాప‌క శాఖ , పోలీసులు , డైవింగ్ నిపుణుల సహాయంతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అన‌న్య రావు వ‌య‌సు 26 ఏళ్లు. త‌ను ఒక రాతి బండ‌పై నుండి న‌దిలో దూకుతున్న‌ట్లు క‌నిపించే సంఘ‌ట‌న‌కు సంబఃధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అన‌న్య రావు స్నేహితులు సాత్విక్, అషిత‌తో క‌లిసి వారాంత‌పు విశ్రాంతి కోసం స‌నాపూర్ గ్రామంలోని ఒక గెస్ట్ హౌస్ కు వ‌చ్చారు.
⚠️ You are not allowed to copy content or view source