కేసీఆర్ పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య
NEWS Feb 20,2025 08:42 am
కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని గతంలో కోర్టులో కేసు వేసిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుపై ఇవాళ విచారణ జరగనుంది. అంతలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. తన భర్త చావుకు కారణం బీఆర్ఎస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డేనని సంచలన ఆరోపణలు చేసింది భార్య.