జగన్ పై కేసు నమోదు
NEWS Feb 20,2025 08:37 am
మాజీ సీఎం జగన్ కు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకుండా గుంటూరు జిల్లాలో పర్యటించారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఎలాంటి పర్మిషన్ ఇవ్వక పోయినా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొన్నారు. కాగా తమ నాయకుడిపై కేసు నమోదు చేయడం పూర్తిగా కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల కోడ్ వర్తించదన్నారు. రైతులను పరామర్శించడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.