Logo
Download our app
పెట్టుబ‌డిదారుల‌కు రెడ్ కార్పెట్
NEWS   Feb 19,2025 04:54 pm
ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికారు మంత్రి కందుల దుర్గేష్. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source