Logo
Download our app
మాజీ మంత్రిపై కేసులు న‌మోదు
NEWS   Feb 18,2025 03:40 am
వైసీపీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక కేసుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేయ‌గా తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై రెండు కేసులు న‌మోద‌య్యాయి. టీడీపీ నేతలపై దాడి, కౌన్సిల్ సభ్యులను నిర్బంధించారనే అభియోగాలతో తుని పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఎఆర్లు న‌మోద‌య్యాయి. కాగా త‌మ నాయ‌కుల‌పై క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ,అయినా బెదిరే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ బాస్ జ‌గ‌న్ రెడ్డి.
⚠️ You are not allowed to copy content or view source