Logo
Download our app
శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు రిలీజ్
NEWS   Feb 18,2025 03:12 am
తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదప ద్మారాధన సేవల మే నెల కోటాను 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయని తెలిపారు ఈవో. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వ‌ర్చువ‌ల్ సేవల కోటా కోసం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source