Logo
Download our app
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు
NEWS   Feb 17,2025 12:53 pm
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌లు వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. ఇబ్ర‌హీంప‌ట్నంకు చెందిన ముక్కెర శ్రీ‌కాంత్ వాడుతున్న రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బండికి అద‌న‌పు సైలెన్స‌ర్ ఏర్పాటు చేశాడు. ఇది పూర్తిగా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్ర‌మించ‌డ‌మేన‌ని పేర్కొన్నారు ఎస్ఐ. ఇక మీదట ఎవ‌రైనా ఇబ్ర‌హీంప‌ట్నం పీఎస్ ప‌రిధిలో ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క పోతే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source