Logo
Download our app
అనౌన్స్ మెంట్ కారణంగానే తొక్కిసలాట
NEWS   Feb 17,2025 05:00 am
ఢిల్లీ రైల్వే స్టేష‌న్ ఘ‌ట‌న‌పై కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో 18 మందికి పైగా మృతి చెందగా 30 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఘ‌ట‌న‌పై కేంద్రం ద్విస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన క‌మిటీ ప్రాథ‌మిక నివేదిక ఇచ్చింది. స్టేష‌న్ లో ఇచ్చిన ప్లాట్ ఫార‌మ్ అనౌన్స్ మెంట్ కార‌ణంగానే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా గుర్తించారు. ఒక ప్లాట్ ఫార‌మ్ మీద‌కు వ‌చ్చే ట్రైన్ మ‌రో ప్లాట్ ఫార‌మ్ మీద‌కు వ‌స్తుందంటూ చెప్ప‌డంతోనే ప్ర‌యాణీకులు ప‌రుగులు తీశార‌ని, తొక్కిస‌లాట జ‌రిగింద‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source