Logo
Download our app
ఢిల్లీ ఘ‌ట‌న బాధాక‌రం
NEWS   Feb 16,2025 04:27 am
ఢిల్లీ రైల్వే స్టేష‌న్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, రాయ్ బ‌రేలి ఎంపీ రాహుల్ గాంధీ. తొక్కిస‌లాట‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు హృద‌య విదార‌కంగా ఉన్నాయ‌ని వాపోయారు. మ‌ర‌ణాల‌ను బీజేపీ ప్ర‌భుత్వం దాచి పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను వీలైనంత త్వరగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source