సీఎంపై భగ్గుమన్న బండి సంజయ్
NEWS Feb 15,2025 12:28 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమ నాయకుడి కులం గురించి ప్రస్తావించడంపై సీరియస్ అయ్యారు. మీ పార్టీ నేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన వ్యక్తి అని ప్రశ్నించారు. నానమ్మ, తాత ఏ మతానికి చెందిన వారో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ తల్లి ఇటలీ దేశస్తురాలని దీనిపై చర్చ జరగాలన్నారు.