Logo
Download our app
ఆడ‌పిల్ల‌ల జోలికి వస్తే తాట తీస్తాం
NEWS   Feb 15,2025 12:24 pm
సీఎం చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎవ‌రైనా స‌రే ఆడ‌పిల్ల‌ల జోలికి వెళ్లినా, నేరాలు చేసినా నేర‌స్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తామ‌ని హెచ్చ‌రించారు. అఘాయిత్యాలు చేసే వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్ర‌గ్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వీటిపై కూట‌మి స‌ర్కార్ యుద్దం చేస్తోందన్నారు. వీటి నియంత్ర‌ణ‌కు ఈగ‌ల్ ను ఏర్పాటు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు.
⚠️ You are not allowed to copy content or view source