Logo
Download our app
వంశీకి తిక్క కుదిరింది - బుద్దా
NEWS   Feb 15,2025 11:26 am
మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి తిక్క కుదిరిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ సీనియ‌ర్ నేత బుద్దా వెంక‌న్న‌. నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడాడ‌ని, చివ‌ర‌కు క‌ర్మ ఫ‌లితం అనుభ‌వించాడ‌ని అన్నారు. వంశీ అరెస్ట్ తో ఇంత కాలానికి శిక్ష ప‌డింద‌ని ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌న్నారు. పిల్ల సైకోకు పెద్ద సైకో మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఆనాడు ఏపీలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వంశీ రెచ్చి పోయాడ‌ని, అన‌రాని మాట‌లు అన్నాడ‌ని, చంద్ర‌బాబు, ఆయ‌న భార్య , కొడుకును దూషించాడ‌ని..జైలు పాల‌య్యాడ‌ని ఎద్దేవా చేశారు.
⚠️ You are not allowed to copy content or view source