వంశీతో భార్య పంకజశ్రీ ములాఖత్
NEWS Feb 15,2025 11:16 am
సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తన భార్య పంకజ శ్రీ ములాఖత్ అయ్యింది. జైలులో తన భర్తకు ప్రాణ హాని ఉందన్నారు. తనను కావాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ వాపోయారు. వెన్ను నొప్పితో బాధ పడుతున్నా పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు. మానసికంగా వేధిస్తున్నారంటూ ఆవేదన చెందారు. వంశీ ఉన్న బారక్ లో 60 సీసీ కెమెరాలు పెట్టారని అన్నారు. విచిత్రం ఏమిటంటే హెల్త్ బాగుందంటూ వైద్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.