తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
NEWS Feb 15,2025 09:10 am
మేడిపల్లి మండలం దమ్మనపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్టు పోలీసులకు బాధిత వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని గంగారెడ్డి వ్యవసాయ పనులకు వెళ్లగా, దొంగలు ఇంటి తాళం పగలకొట్టి బీరువాలో ఉన్న బంగారం చోరీ చేసినట్టు తెలుస్తుంది. గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.