ఢిల్లీలో ఆప్ ఓటమికి కవితే కారణం
NEWS Feb 15,2025 05:03 am
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆప్ ఓడి పోవడానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కుటుంబమేనని ఆరోపించారు. ఎవరైనా మహిళలు రాజకీయాలు చేయడం చూశాం కానీ ఎక్కడా లిక్కర్ దందా చేసినట్లు తాను చూడలేదన్నారు. ఆమె చేసిన నిర్వాకం కారణంగానే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారానికి దూరమైందన్నారు. కవిత కారణంగా తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందని, ఢిల్లీలో ఆప్ ను నామ రూపాలు లేకుండా చేసిందన్నారు.