వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వండి
NEWS Feb 15,2025 04:31 am
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఆయనను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం పిటిషన్ ను విచారించనుంది కోర్టు. వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని కోరారు.