తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష తగదు
NEWS Feb 15,2025 04:03 am
మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని అన్నారు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వదు..విభజన హామీలు అమలు చేయదని ఆరోపించారు. తాము ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ఆనాడు రూ. 15 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఇచ్చిందని , కానీ బీఆర్ఎస్ ఏడున్నర లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందంటూ మండిపడ్డారు.