వల్లభనేని వంశీకి తగిన శాస్తి జరిగింది
NEWS Feb 15,2025 03:53 am
మాజీ ఎమ్మెల్యే వంశీపై సీరియస్ కామెంట్స్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆడబిడ్డలపై నోరు పారేసుకున్న వంశీ అరెస్ట్ సక్రమమేనని అన్నారు. ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ గా మాట్లాడుతున్న అంబటి రాంబాబును కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన కేరెక్టర్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. ఇకనైనా రంకెలు వేయడం మానుకుంటే మంచిదని సూచించారు. తప్పు చేసిన వారు చట్టం ముందు తప్పించు కోలేరని అన్నారు. వంశీ జైలుకు వెళ్లడానికి ప్రధాన కారకుడు జగనేనని ఆరోపించారు.