రెండేళ్లలో 105 రెసిడెన్షియల్ స్కూల్స్
NEWS Feb 15,2025 03:41 am
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి తక్షణమే స్థలాల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.