సీఎం చేసే ప్రయత్నాలు ఫలించవు
NEWS Feb 15,2025 03:26 am
కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు 50 శాతానికి మించి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఏ మాత్రం చర్యలు తీసుకున్నా అడ్డుకుని తీరుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.