మోహన్ బాబు బౌన్సర్ల పై మనోజ్ ఫిర్యాదు
NEWS Feb 14,2025 01:24 pm
తన తండ్రి మోహన్ బాబుకు చెందిన బౌన్సర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంచు మనోజ్. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్శిటీ ఎదుట ఉన్న ఎఫ్5 రెస్టారెంట్ పై బౌన్సర్లు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. హేమాద్రి నాయుడు అనే వ్యక్తితో పాటు బౌన్సర్లపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. దీనిపై దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు.