బాధ్యత కుటుంబానికి SI ఆర్థిక సహాయం
NEWS Feb 14,2025 01:44 pm
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో శ్రీ విజయ కిరాణా షాప్ లోవిద్యుత్ షాక్ తో మంటలు ఏర్పడి కిరాణం షాపు దగ్ధమైన విషయం తెలిసిందే. కిరాణం కుటుంబ సభ్యులకు 5000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులను పస్రా ఎస్సై కమలాకర్ అందించారు. సమాజంలో ఎదుటి వ్యక్తికి ఆపద కలిగినప్పుడు పెద్ద మనసుతో ప్రతి ఒక్కరూ ఎదుటివారికి తోడ్పాటు అందించి కష్టాలను గట్టెక్కించే విధంగా ప్రతి ఒకరు తమ వంతు సహాయాన్ని అందించాలని ఎస్ఐ కోరారు.