సీఎం పోస్టు పర్మినెంట్ కాదు
NEWS Feb 14,2025 12:56 pm
సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి పదవి పర్మినెంట్ కాదన్నారు. ఈ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా వినిపించుకోక పోవడం దారుణమన్నారు. అధికారం ఉంది కదా అని పోలీసులను వాడుకుంటే ఎలా అని ప్రశ్నించారు. గుమ్మడిదల డంపింగ్ యార్డు నిర్మాణ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.