రంగరాజన్ ని పరామర్శించిన శ్యామల
NEWS Feb 14,2025 12:32 pm
హైదరాబాద్: YSRCP అధికార ప్రతినిధి ఆరే శ్యామల చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ని పరామర్శించారు. ఆలయ అర్చకులపై జరిగిన దాడిని ఖండించారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అర్చకుల భద్రతకు సంబంధించిన ఈ సంఘటనపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. YSRCP ఎల్లప్పుడూ న్యాయానికి, ధర్మానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.