రంగరాజన్ ను పరామర్శించిన మందకృష్ణ
NEWS Feb 14,2025 12:22 pm
రామరాజ్యం సంస్థ నిర్వాహకుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ ను పరామర్శించారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఈ సందర్బంగా తనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇతరుల మనోభావాలను గౌరవించాలని, హిందూ ధర్మం దాడులను ప్రోత్సహించదన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మందకృష్ణ మాదిగ.