క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దుతాం
NEWS Feb 14,2025 11:39 am
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. ఏప్రిల్ లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కేంద్రం మద్ధతు ఇవ్వాలని కోరామన్నారు. అన్నినగరాలలో క్రీడా మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రూ . 280.9 కోట్ల రూపాయలు కేటాయించాలని విన్నవించామన్నారు.