Logo
Download our app
ప‌ళ‌ని నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ర‌వాణా సౌక‌ర్యం
NEWS   Feb 14,2025 11:26 am
ద‌క్షిణ భార‌త దేశ ఆల‌యాల సంద‌ర్శ‌న‌లో బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌ళ‌నిలోని శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ, పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. స్వామికి త‌నయుడు అకిరా నంద‌న్ , టీటీడీ బోర్డు స‌భ్యుడు ఆనంద సాయితో క‌లిసి పూజ‌లు చేశారు. ప‌ళ‌ని నుంచి పెద్ద ఎత్తున తిరుమ‌ల‌కు వ‌స్తుంటార‌ని, వారికి మెరుగైన ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. సీఎంతో మాట్లాడుతామ‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source