రేవంత్ మోసగాడని రాహుల్ కు తెలుసు
NEWS Feb 14,2025 07:21 am
సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అన్ని పథకాలు అమలవుతున్నాయని రాహుల్ గాంధీకి అబద్దాలు చెప్పాడని ఆరోపించారు. రాహుల్ వరంగల్ టూర్ కు వస్తే నిజాలు బయట పడుతాయని రాకుండా చేశారని అన్నారు. సీఎం మోసగాడని యువ నాయకుడికి తెలిసి పోయిందని, అందుకే ఓరుగల్లు పర్యటనను రద్దు చేసుకున్నాడని అన్నారు. ఎక్కువ కాలం సీఎంగా కొనసాగడం కష్టమేనని అన్నారు. తన కేరెక్టర్ తెలిసే తనను దూరం పెట్టాడన్నారు.