విధులను బహిష్కరించిన మెట్ పల్లి బార్ అసోసియేషన్
NEWS Feb 14,2025 07:22 am
రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై దాడిని నిరసిస్తూ మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు మెట్ పల్లి కోర్టులో తమ విధులను బహిష్కరించారు. న్యాయం చెప్పే జడ్జి పైనే దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఎలా అని మండిపడ్డారు. మహిళా జడ్జి కి సంఘీభావంగా నినాదాలు చేస్తూ విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్య క్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.