బీజేపీలో వేధింపులు తట్టుకోలేక పోతున్నా
NEWS Feb 14,2025 07:02 am
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో వేధింపులు తట్టుకోలేక పోతున్నానని వాపోయాడు. ఒకవేళ అవసరం లేదని అనుకుంటే తాను వెళ్లి పోయేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించాడు. పార్టీలో కొందరు బ్రోకరిజం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గోల్కండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవి బీసీ లేదా ఎస్సీకి ఇవ్వాలని సూచించానని అన్నారు. కానీ ఎంఐఎంతో కలిసి తిరుగుతున్న వ్యక్తికి పదవి ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతకు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు.