సీఎం రేవంత్ కు ఫుల్ సపోర్ట్
NEWS Feb 14,2025 05:04 am
తమపై కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. 11 మంది ఎమ్మెల్యేలం భేటీ అయ్యింది వాస్తవమేనని అన్నారు. నియోజకవర్గంలో పనుల గురించి ప్రస్తావిస్తే తప్పేముందంటూ ప్రశ్నించారు. తామంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు. మంత్రులు వారి నియోజకవర్గాలు ఎలా నిధులు ఇచ్చుకుంటున్నారో తమకు కూడా అలాగే ఇవ్వాలని కోరామన్నారు.