పర్యాటక హబ్ గా ఆంధ్రప్రదేశ్
NEWS Feb 14,2025 04:26 am
పర్యాటక రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. స్పష్టమైన ప్లాన్స్ తో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.పర్యాటక రంగంలో ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులపై అధ్యయనం జరుగుతోందని, ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేలను అభివృద్ది చేస్తామన్నారు.