నీటి ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే
NEWS Feb 14,2025 02:58 am
సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో అనుకున్న పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి కావాల్సిందేనని హెచ్చరించారు. అన్ని అనుమతులు, నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదన్నారు. 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలన్నారు. పోలవరం ఫలితాలు వచ్చేనాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదుబాటులోకి రావాలన్నారు. గ్రౌండ్ వాటర్ పెంపుపై ప్రణాళికకు నాలుగు శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.