వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
NEWS Feb 14,2025 02:37 am
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ప్రోత్సహించిన ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోక పోవడంతో హైదరాబాద్ లో ఉంటున్న వంశీని అదుపులోకి తీసుకున్నారు.