వంశీ ఓ మృగం లాంటోడు - సోమిరెడ్డి
NEWS Feb 13,2025 11:00 am
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తను మృగం లాంటోడని మండిపడ్డారు. ఏ తప్పు చేయక పోతే ఓడి పోయిన వెంటనే దేశం విడిచి ఎందుకు వెళ్లి పోయాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరో నాలుగైదు మృగాలు ఉన్నాయని, వాళ్లు కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని హెచ్చరించారు. వైసీపీలో టాప్ టూ బాటమ్ అందరూ అలాగే తయారయ్యారంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిని సమర్థించిన జగన్ రెడ్డికి పార్టీ నడిపే అర్హత లేదన్నారు.