స్వామి నాథ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్
NEWS Feb 13,2025 09:50 am
పుణ్య క్షేత్ర యాత్ర పర్యటనలో భాగంగా బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తంజావూరు సమీపం లోని స్వామి మలైని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు శ్రీ కన్నన్ గురుకల్... సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పంచ హారతులతో హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజ స్థంభానికి మొక్కారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.