గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్
NEWS Feb 13,2025 08:10 am
హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను గవర్నమెంట్ సేవల్లో వినియోగిస్తామని చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదని, గ్లోబల్ లీడర్లను అందించే హబ్ అని స్పష్టం చేశారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇస్తామన్నారు.