Logo
Download our app
ఏపీని వ‌ణికిస్తున్న బ‌ర్డ్ ఫ్లూ
NEWS   Feb 13,2025 02:57 am
ఏపీని బ‌ర్డ్ ఫ్లూ వ్యాధి వ‌ణికిస్తోంది. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా సీఎం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. కొంత కాలం పాటు చికెన్ కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ల‌క్ష‌ల కోళ్లు అంతు చిక్క‌ని వైర‌స్ తో మృత్యువాత ప‌డుతున్నాయి. మ‌రో వైపు ఏపీ నుంచి కోళ్ల‌ను తీసుకు వ‌చ్చే వాహ‌నాల‌ను తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోనే తిరిగి పంపిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ఒక‌రికి బ‌ర్డ్ ఫ్లూ సోకింద‌ని స‌మాచారం.
⚠️ You are not allowed to copy content or view source