Logo
Download our app
ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్
NEWS   Feb 12,2025 12:53 pm
సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల్లో ఆయా పార్టీలు ఉచితాలు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల మండిప‌డింది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిరాశ్ర‌యుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ పై జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ , జ‌స్టిస్ అగ‌స్టీన్ జార్జ్ తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఉచిత రేష‌న్ , న‌గ‌దు అందుతుండ‌డంతో ప్ర‌జ‌లు ప‌ని చేసేందుకు ఇష్ట ప‌డ‌టం లేద‌ని, ఇలా అయితే స‌మాజం ఎలా అభివృద్ది చెందుతుంద‌ని ప్ర‌శ్నించింది. ఉచితాలతో ఏ ప‌ని చేయ‌కుండా ఆహారం, డ‌బ్బు సంపాదించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించింది.
⚠️ You are not allowed to copy content or view source