Logo
Download our app
సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
NEWS   Feb 12,2025 11:28 am
దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాలు ఉన్నార‌ని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ‌. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మ‌హారాజ్ జ‌యంతిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. అవ‌స‌ర‌మైతే ఈ విష‌యం గురించి ప్ర‌ధాన‌మంత్రి మోడీ దృష్టికి తీసుకు వెళ‌తామ‌ని చెప్పారు. కేంద్రం బంజారాలు అన్ని రంగాల‌లో అభివృద్ది సాధించేలా చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. బంజారా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న‌ద‌ని తెలిపారు డీకే అరుణ‌.
⚠️ You are not allowed to copy content or view source