బాబుపై లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్
NEWS Feb 12,2025 11:23 am
వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు పోతే ఎవరూ బాధ పడరని అన్నారు. పీడ పోయింది అనుకుంటారని అన్నారు. ఆయన వయసు 76 ఏళ్లు. బాబు ఆరోగ్యం కూడా సరిగా లేదన్నారు. వయసు చివర్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. తనను నమ్ముకున్న వారు ఎవరూ ఇప్పటి వరకు బాగు పడిన దాఖలాలు లేవన్నారు. బాబుని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందన్నారు.