Logo
Download our app
వాహ‌నాల కోసం పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించాలి
NEWS   Feb 11,2025 02:32 pm
తాండూర్ మండలం ఐబీ చౌరస్తాలోని హైవే అండర్ బ్రిడ్జి వద్ద వాహనాలకు పార్కింగ్ స్థలం చూపించాలని తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జి దాసరి శ్రీనివాస్ కోరారు. ఎంపీడీవో శ్రీనివాస్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రానికి వస్తున్న వాహనాదారులకు పార్కింగ్ సౌకర్యం లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐబీ చౌరస్తాలో ప్రజల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల‌ని విన్న‌వించారు.
⚠️ You are not allowed to copy content or view source