Logo
Download our app
మంద‌కృష్ణ మాదిగ యూట‌ర్న్
NEWS   Feb 11,2025 10:39 am
నిన్న‌టి దాకా సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ ఉన్న‌ట్టుండి మ‌న‌సు మార్చుకున్నారు. సీఎంను త‌న నివాసంలో భేటీ అయ్యారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సీఎం నిబద్ధతను అభినందించారు. ఉప కులాల వర్గీకరణలో పలు సమస్యలను వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ, మాదిగ ఉప కులాలకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కూడా ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source