కడప ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి
NEWS Feb 11,2025 08:51 am
కడప జిల్లా బీ కోడూరు మండలంలో విద్యుత్ షాక్ కు గురై తల్లీ కొడుకు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. పొలాల్లోకి వెళ్లేటప్పుడు రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వేలాడుతున్న కరెంట్ తీగల గురించి విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియ చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.